- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో ACB దాడులు.. నివ్వెరపోయిన అధికారులు
దిశ ప్రతినిధి, కరీంనగర్: అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి చిక్కిన హెడ్ కానిస్టేబుల్ చంద్ర ప్రకాష్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు ఒక్క సారిగా షాక్ అయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రూ.6 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ హెడ్ కానిస్టేబుల్ చంద్ర ప్రకాష్ ఇంట్లో తనిఖీలు చేస్తే అక్రమ ఆస్తుల చిట్టా ఏమైనా దొరుకుతుందేమోనని ఆశించారు. అయితే, అతని ఇంట్లో రూ.4.50 లక్షల నగదుతో పాటు సుమారు 40 వరకు 303 తూటాలు, ఒక 9 ఎంఎం రౌండు లభ్యం అయినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తూటాలకు సంబంధించిన వివరాలను ఏసీబీ అధికారులు సంబంధిత స్టేషన్‌కు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అవినీతి వ్యవహారాలను మాత్రమే పర్యవేక్షించే విభాగం అయినందున చంద్రప్రకాష్ పనిచేసేలా అండ్ ఆర్డర్ విభాగానికి నివేదిక ఇచ్చినట్టు సమాచారం.
ఆయన ఇంట్లో ఎక్కడివో..?
హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో తూటాలు లభ్యం కావడం పోలీసు అధికారులను ఆలోచనలో పడేసినట్టుగా తెలుస్తోంది. ఆయన ఈ రౌండ్లను ఎందుకు సేకరించుకున్నాడోనన్నదే అధికారులకు అంతు చిక్కకుండా తయారైంది. అయితే, అవి డిపార్ట్‌మెంట్ సప్లై చేసినవేనా లేక అక్రమంగా ప్రైవేటు వారి నుండి రికవరీ చేసినవా అన్న కోణంలో ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. డిపార్ట్‌మెంట్‌కు చెందిన రౌండ్లు అయితే ఆయన ఇంట్లో దాచిపెట్టుకోవడం వెనక ఆంతర్యమేంటి అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతోంది. శాఖ పరంగా సరఫరా చేసిన రౌండ్లు సంబంధిత స్టేషన్‌లో స్ట్రాంగ్ రూంలో ఉండాల్సి ఉంటుంది కానీ, హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో దాచిపెట్టే అవకాశం ఉండదని పోలీసు వర్గాలు అంటున్నాయి.
అధికారిక లెక్కలతో సంబంధం లేకుండా ఉన్న తూటాలే అయితే, అవి చంద్ర ప్రకాష్ చేతికి ఎలా వచ్చాయి అన్నదే పజిల్‌గా మారింది. ఆయుధ వ్యాపారులు కూడా తూటాలు కానీ, ఇతరాత్ర ఆయుధాలకు సంబంధించిన క్రయవిక్రయాలను రికార్డు చేస్తుంటారు. అసాంఘీక శక్తుల చేతుల్లోకి రౌండ్లు చేరకుండా ఉండేందుకు పోలీసు శాఖ కూడా ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తుంటుంది. కానీ, హెడ్ కానిస్టేబుల్ ఇంట్లోనే రౌండ్లు లభ్యం కావడమే ఖాకీల్లో కలకలం సృష్టిస్తోంది. డిపార్ట్ మెంట్లో పనిచేస్తూ ఆయన తూటాలు అక్రమంగా ఎలా దాచి పెట్టుకున్నాడన్న విషయంపై పోలీసు అధికారులు దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో తూటాలు లభ్యం కావడం మాత్రం కొత్త అనుమానాలకు తెరలేపిందన్నది నిజం.