ACB :ఏసీబీకి చిక్కిన మెడికల్ కళాశాల అధికారులు

by Sridhar Babu |
ACB :ఏసీబీకి చిక్కిన మెడికల్ కళాశాల అధికారులు
X

దిశ, కొత్తగూడెం : కొత్తగూడెం మెడికల్ కళాశాల(Kothagudem Medical College)లో రూ.మూడు లక్షల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మెడికల్ కాలేజీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పని చేస్తున్న ఖలీలుల్ల, జూనియర్ అసిస్టెంట్ సుధాకర్ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ (ACB DSP Y. Ramesh)తెలిపిన వివరాల ప్రకారం కొత్తగూడెం మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న 49 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల 9 నెలల వేతనాల బిల్లుని చేసేందుకు ఔట్సోర్సింగ్ ఏజెన్సీ వద్ద మెడికల్ కళాశాల ఏఓ ఖలీలుల్లా, జూనియర్ అసిస్టెంట్ సుధాకర్ పదిహేను లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశారు.

తాము అంత ఇవ్వలేమని ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ప్రతినిధులు రూ.7 లక్షలకి బేరం కుదుర్చుకొని అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించారు. మంగళవారం మొదటి విడతగా మూడు లక్షలు (Three lakhs)తీసుకుంటూ ఏఓ ఖలిల్లుల్ల, జూనియర్ అసిస్టెంట్ సుధాకర్ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి పట్టుబడ్డారు. పట్టుబడ్డ ఇద్దరు ఉద్యోగులను ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ విచారిస్తున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు.

Advertisement

Next Story

Most Viewed