గోదావరిఖనిలో దారుణం.. ముగ్గురిని కత్తితో పొడిచిన వృద్ధుడు

by GSrikanth |
గోదావరిఖనిలో దారుణం.. ముగ్గురిని కత్తితో పొడిచిన వృద్ధుడు
X

దిశ, గోదావరి ఖని: ఏసీ విషయంలో జరిగిన గొడవ ముగ్గురి ప్రాణాల మీదికి తెచ్చింది. ఆవేశానికి గురైన వృద్ధుడు ముగ్గురిపై కత్తితో దాడి చేయగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మంగళవారం అర్థరాత్రి గోదావరిఖని హనుమాన్ నగర్‌లో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి జంగిలి మొగిలి, మామిడాల పోశం అనే ఇద్దరు వ్యక్తులు హనుమాన్ నగర్‌లో పక్క పక్కన నివాసాల్లో ఉంటున్నారు. గత కొంతకాలంగా మామిడాల పోశంకు చెందిన ఏసీ పైపు మొగిలి ఇంటివైపు తెరుచుకొని నీళ్ళు పోస్తున్నాయని, గత రాత్రి కూడా ఇలాగే జరగడంతో పోషంను మొగిలి హెచ్చరించాడు. దీంతో వివాదం చెలరేగింది. ఆవేశానికి గురైన మొగిలి తన వద్ద ఉన్న కత్తితో పొషం మనవడైన సాయివరణ్ కడుపులో పొడిచాడు. అడ్డొచ్చిన పోషంను, ఆయన బంధువు జుంజుపల్లి శేఖర్‌పైనా కత్తితో దాడిచేశాడు. ఈ దాడిలో ముగ్గురుకీ తీవ్ర గాయాలు అయ్యియి. వారిని కాలనీవాసులు పట్టణంలోని ఆసుపత్రికి తరలించారు. పోషం, సాయి వరుణ్ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు మొగిలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed