- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వృద్ధురాలి మెడలో బంగారం గొలుసు అపహరణ..
దిశ, శంకర్పల్లి: వృద్ధురాలి మెడలో మూడు తులాల బంగారం గొలుసును గుర్తు తెలియని వ్యక్తి తెంపుకొని బైకుపై పారిపోయిన సంఘటన శంకర్పల్లి పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం భానూరు గ్రామానికి చెందిన లక్ష్మీ అనే వృద్ధురాలు తన కోడలు సరిత, మనుమడు పవన్ లు కలిసి బంధువుల ఇంట్లో తొట్టెల పండుగ ఉండడంతో బస్సులో శంకర్పల్లి కి వచ్చారు.
బస్సు దిగి శంకర్పల్లిలోని అయ్యప్ప రెడ్డి గూడెంకు నడుచుకుంటూ వెళ్తుండగా, సాయి కాలనీలోని డాక్టర్ వాటర్ ప్లాంట్ వద్దకు రాగానే మోటారు బైకుపై హెల్మెట్ పెట్టుకున్న ఓ వ్యక్తి వృద్ధురాలు మెడలో నుంచి బంగారు గొలుసును లాక్కొని వెళ్ళాడు. లక్ష్మితో పాటుగా సరిత, పవన్ లు నిందితుడిని పట్టుకునేందుకు పరుగులు తీసిన దొరకలేదు. దీంతో చేసేదేమి లేక వారు వెంటనే శంకర్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సమాచారాన్ని తెలుసుకున్న రాజేంద్రనగర్ అడిషనల్ డీసీపీ రష్మీ పెరుమాళ్, సైబరాబాద్ క్రైమ్ అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి, నార్సింగ్ ఏసీపీ రమణ గౌడ్, శంకర్పల్లి సీఐ ప్రసన్న కుమార్, డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ లక్ష్మారెడ్డి, సీసీఎస్ సీఐ నరసింహ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని విషయాన్ని ఆరా తీశారు. పట్టపగలు 3: 30 గంటల ప్రాంతంలో దొంగతనం జరగడంతో పోలీసులు విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతంలో దొంగతనం జరగడం పట్ల వారు విస్మయం వ్యక్తం చేశారు. నిందితుడిని ఎలాగైనా పట్టుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.