- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రేమ వివాహం చేసుకున్న యువతి అనూహ్యరీతిలో మిస్సింగ్

దిశ, వనస్థలిపురం : ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువతి అనూహ్యరీతిలో మిస్సింగ్ అయింది. ప్రేమించిన యువకుడిని పెళ్లాడి రెండేళ్లు కాపురం చేసిన ఆమె.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదృశ్యం అయింది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను సీఐ సూర్య నాయక్ వెల్లడించారు.
నాగోల్ ప్రాంతంలోని అజయ్ నగర్‌కు చెందిన బొల్లు రంజిత్, నిజామాబాద్ జిల్లా లింగంపేటకు చెందిన వైష్ణవి రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటినుంచి వీరు అజయ్ నగర్‌లో ఉంటున్నారు. ఆదివారం రంజిత్ ఇంట్లో లేని సమయం చూసి.. వైష్ణవి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. రంజిత్ గురించి సమీప ప్రాంతాల్లో, స్నేహితుల వద్ద ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. బంధువులకు ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సూర్య నాయక్ తెలిపారు. వైష్ణవి ఎందుకు మిస్ అయిందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.