- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీలో మరో యువతి దారుణ హత్య
దిశ, వెబ్ డెస్క్: రెండు రోజుల క్రితం జరిగిన సాక్షి హత్యా ఘటనను మరువక ముందే ఢిల్లీలో మరో యువతి హత్యకు గురైంది. ఇంటి టెర్రస్ పై రక్తపు మడుగులో ఉన్న ఓ యువతి బాడీని ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నార్త్ ఢిల్లీలోని మంజు కా టిల్లా అపార్ట్ మెంట్ లో రాణి (35), సప్నా అనే ఇద్దరు యువతులు ఉంటున్నారు. రాణి గురుగ్రాంలో బ్యూటీ పార్లర్ లో పని చేసేది. ఇక సప్నాకు విడాకులు కాగా కూతురితో కలిసి రాణితో ఉంటోంది. సప్నా ఓ పెళ్లి వేడుకల్లో వెయిటర్ గా పని చేస్తుంటుంది.
కాగా ఓ పార్టీలో సప్నా బాగా మద్యం సేవించి రాణిని ఇష్టమొచ్చినట్లు తిట్టింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వివాదం నడిచింది. అనంతరం వేర్వేరుగా ఇద్దరు తమ ఫ్లాట్ లోకి వచ్చారు. అయితే మంగళవారం ఉదయం మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే సప్నా కత్తితో రాణిని ఇష్టమొచ్చినట్లు పొడిచి హత్య చేసింది. అనంతరం పోలీసులకు లొంగిపోయింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీ నార్త్ డీసీపీ సాగర్ ఖాస్లీ తెలిపారు.