వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య

by Sumithra |
వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య
X

దిశ, భిక్కనూరు : వరుసకు మేనమామ వేధింపులు భరించలేక సాఫ్ట్ వేర్ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన భిక్కనూరు మండల కేంద్రంలో తీవ్ర విషాదాన్ని నింపింది. భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన తాటిపాముల కిరణ్ కుమార్ గౌడ్ పంచాయతీరాజ్ శాఖలో వర్క్ ఇన్స్ పెక్టర్ గా పనిచేస్తూ, గత కొన్ని రోజులుగా కామారెడ్డి ఇల్లు అద్దెకు తీసుకొని కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు. తన కూతురు అభిజ్ఞ (23) గత కొన్ని సంవత్సరాలుగా సాఫ్ట్ వేర్ గా వర్క్ ఫ్రం హోం చేస్తుంది. అయితే వరుసకు మేనమామ అయిన సందీప్ నిన్ను పెళ్లి చేసుకుంటానని టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. అప్పటికే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని, కూతురు పుట్టిన సందీప్, అభిజ్ఞను పెళ్లి చేసుకుంటానని టార్చర్ చేస్తున్నప్పటికీ, తల్లిదండ్రులకు మాత్రం ఈ విషయం చెప్పకుండా గోప్యంగా ఉంచుతూ మానసికంగా కృంగిపోయింది.

అయితే గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో సాయంత్రం ఇంట్లో ఫ్యానుకు చున్నీతో ఉరి వేసుకుంది. ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్న తల్లి స్వప్న, స్కూల్ నుంచి ఇంటికి చేరుకోగానే, తలుపులు తీయమని ఎన్నిసార్లు డోర్ కొట్టిన తెరవకపోవడం, కిటికీలు సైతం మూసి ఉండడంతో అనుమానం వచ్చి పక్కింటి వారికి సమాచారం అందించి. అందరూ కలసి డోర్లను బలంగా కొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి కూతురు అభిజ్ఞ ఫ్యానుకు వేలాడడం చూసి బోరున విలపించింది. తన ఆత్మహత్యకు మేనమామ టార్చరే ప్రధాన కారమణి పక్కనే టేబుల్ పై లేఖ రాసి ఉంచింది. కూతురు ఆత్మహత్యకు కారకుడైన సందీప్ ను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కామారెడ్డి పట్టణ పోలీసులు కేసునమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. శుక్రవారం మండల కేంద్రమైన భిక్కనూరు లో అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement

Next Story

Most Viewed