ఆ విషయంలో వేధించిన భర్త.. తట్టుకోలేక భార్య..!

by sudharani |
ఆ విషయంలో వేధించిన భర్త.. తట్టుకోలేక భార్య..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆడపిల్లలు పుట్టింది మొదలు తల్లిదండ్రులు ఎన్నో లెక్కలు వేసుకుంటారు. పిల్లల చదువులకు, పెళ్లికి అంటూ డబ్బు కూడబెట్టుకుంటారు. పెళ్లి వయసు వచ్చాక వారికి ఉన్నంతలో కట్నాలు సమర్పించుకుని ఘనంగా వివాహం జరిపించి అత్తారింటికి సాగనంపుతారు. కానీ, కొంతమంది అత్తింటి వారు కోడలు తెచ్చింది సరిపోక ఇంకా డబ్బు కావాలంటూ వరకట్నం కోసం వేధిస్తారు. అత్తింటి వరకట్నం వేధింపులు భరించలేక ఎంతోమంది ఆడపిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎన్నో కష్టాలు పడి పెళ్లిల్లు చేసిన తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చి ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే కర్ణాటకలో జరిగింది. తెచ్చిన కట్నం సరిపోక వరకట్నం కోసం వేధించి యువతి ప్రాణాలకు పోయేందుకు కారణమయ్యాడు భర్త. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

బంగారు పేట దొడ్డేరు గ్రామానికి చెందిన అంబిక (25) అనే యువతికి.. ఖాద్రి పురానికి చెందిన మధు అనే వ్యక్తితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. మధు వృత్తిరిత్యా ప్లంబర్. వీరికి ఇద్దరు సంతానం. అయితే మధు మద్యానికి బానిసగా మారి రోజు భార్యతో గొడవ పడేవాడు. అదనపు కట్నం తేవాలంటూ పుట్టింటికి పంపేవాడు. ఈ విషయంపై అంబిక తల్లిదండ్రులు పెద్దలకు ఫిర్యాదు చేయడంతో.. పంచాయితీ చేసి రాజీ కుదిర్చారు. అయినప్పటికీ మధులో ఎలాంటి మార్పు రాలేదు.

ఎప్పటిలాగే రోజూ తాగి వచ్చి భార్యను హింసించేవాడు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి కూడా ఫుల్‌గా మద్యం సేవించిన మధు భార్యతో గొడవ పడ్డారు. తెల్లారే సరికి ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది. అయితే మధు తన భార్య ఆత్మహత్య చేసుకుందని చెప్తున్నాడు. కానీ, బాధితురాలు కుటుంబ సభ్యులు మాత్రం తమ బిడ్డది హత్య అని.. భర్తే ఆమెను చంపేశాడని ఆరోపిస్తున్నారు. బాధితురాలు అంబిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అంబిక ఆత్మహత్య చేసుకుందా.. లేక భర్తే ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడ అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed