- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గర్ల్‌ఫ్రెండ్‌తో వీడియో కాల్ మాట్లాడుతూ అలా చేసిన యువకుడు.. కట్ చేస్తే..?
దిశ, వెబ్‌డెస్క్: ప్రేమికుల మధ్య తరచూ గొడవలు జరగడం కామనే. భార్యభర్తల మాదిరిగానే అలకపాన్పులెక్కడం, గిల్లికజ్జాలు కట్టడం సహజమే. కొంత మంది వాటిని తెలికగా తీసుకొని ప్రశాంతంగా ఉంటారు. కానీ, మరికొందరు మాత్రం ప్రాణాల మీదకు వచ్చేలా చేసుకుంటారు. తాజాగా జరిగిన ఘటన కూడా అలాంటిదే.
ముంబైలోని పరుశురామ్ అనే యువకుడు అర్ధరాత్రి వినాయక మండపానికి వెళ్లాడు. అనంతరం రోడ్‌పై నిలబడి తన ప్రేయసితో ఫోన్‌లో మాట్లాడుతూ ఏదో కారణంతో గొడవ పడ్డాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి ప్రేయసికి వీడియో కాల్ చేశాడు. అలా మాట్లాడుతూనే ఆమెను బెదిరించాలనే ఉద్దేశంతో ఒంటికి నిప్పంటించుకున్నాడు. కాటన్ షర్ట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పరుశురామ్ ఫోన్ వదిలేసి అరవడం ప్రారంభించాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స చేసిన వైద్యులు అతని శరీరం 30 శాతం కాలిపోయిందని తెలిపారు. క్షణికావేశంలో చేసిన పనికి అతడు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడంతోపాటు కుటుంబ సభ్యులకు శోకాన్ని మిగిల్చాడు.
అర్ధరాత్రి నడిరోడ్డుపై మెడికల్ స్టూడెంట్‌పై పోలీస్ అత్యాచారం..