Road Accident : అమెరికాలో హైదరాబాద్ యువకుడి దుర్మరణం

by M.Rajitha |   ( Updated:2024-11-19 16:19:44.0  )
Road Accident : అమెరికాలో హైదరాబాద్ యువకుడి దుర్మరణం
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా(America)లో చదువుతున్న హైదరాబాద్(Hyderabad) యువకుడు ఓ ఆక్సిడెంట్ లో దుర్మరణం పాలయ్యాడు. కుత్బుల్లాపూర్ డివిజన్లోని పద్మానగర్ లో నివాసం ఉంటున్న రాం ఆశీష్ చిన్న కుమారుడు సందీప్ కుమార్ యాదవ్ ఎమ్మెస్ చేయడానికి అమెరికా వెళ్ళాడు. ఈనెల 17న తన ఫ్రెండ్ ను కలవడానికి ఈయటర్ ఫ్రెండ్స్ తో కారులో వెళ్తుండగా.. అతివేగంగా వచ్చిన కారు వీరి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సందీప్ స్పాట్ లోనే మృతి చెందగా.. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా చదువు పూర్తి చేసుకొని వస్తాడనుకున్న కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. తమ కుమారుడి మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకు వచ్చేందుకు సహాయం చేయాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed