నీటి గుంతలో పడి యువకుడి మృతి

by Shiva |
నీటి గుంతలో పడి యువకుడి మృతి
X

దిశ, రాయపోల్ : నీటి గుంతలో పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన రాయపోల్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాల్ల కృష్ణ తన బంధువుల దశదిన కర్మ సందర్భంగా స్నానాలకు వెళ్లాడు. నీటి గుంతలో స్నానానికి దిగిన కృష్ణ ప్రమాదవశాత్తు అందులోనే మునిగిపోయాడు. స్నానానికని వెళ్లిన కృష్ణను వెతుక్కుంటూ నీటి గుంట వద్దకు కుటుంబ సభ్యులు రాగా, అనుమానం వచ్చి నీటి గుంతలో వెతకగా.. కృష్ణ అప్పటికే చనిపోయాడు. భార్య భాగ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహబూబ్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed