ట్రాక్టర్ పై నుండి జారిపడిన యువకుడు మృతి

by Sridhar Babu |
ట్రాక్టర్ పై నుండి జారిపడిన యువకుడు మృతి
X

దిశ, అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పాపిడిగూడెం వద్ద ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుండి జారిపడి కొత్తపల్లి వెంకటేశ్వరరావు (22) అనే యువకుడు మృతి చెందాడు. ఎస్సై శివరామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెంకు చెందిన కొత్తపల్లి వెంకటేశ్వరరావు బుధవారం పామాయిల్ గెలల లోడు ట్రాక్టర్ ను నడుపుతూ అశ్వారావుపేటకు వస్తుండగా.. పాపిడిగూడెం గ్రామ సమీపంలో ట్రాక్టర్ అదుపు తప్పింది. దీంతో ట్రాక్టర్ పై నుండి జారి చక్రాల కింద పడడంతో మృతిచెందాడు. మృతుడి తల్లి కొత్తపల్లి వరలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Advertisement

Next Story