- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఆన్లైన్ బెట్టింగ్స్‌కు ఓ యువకుడి బలి..
దిశ, బడంగ్పేట్ : ఆన్లైన్ బెట్టింగ్స్ ఓ కుటుంబంలో తీరనివిషాదం మిగిల్చింది. చేతికి అందివచ్చిన చెట్టంత కొడుకును ఆన్లైన్ బెట్టింగ్స్ బలితీసుకుంది. బీరువాలో దాచిన బంగారం కూడా కుదవపెట్టి బెట్టింగ్స్‌లో ఓడిపోవడం... బీరువాలో దాచిన బంగారం తల్లికి కనిపించక నిలదీయడంతో తీవ్రమనస్థాపానికి చెందిన పెద్ద కొడుకు వేప చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన ఆదివారం తెల్లవారు జామున పహాడిషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో తీవ్రకలకలం రేపుతుంది. పహాడిషరీఫ్ ఎస్సై వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం. మామిడిపల్లికి చెందిన చంద్రయ్య, శశికళ దంపతులకు ముగ్గురు కుమారులు.
పెద్దకుమారుడు రాజశేఖర్ (26) ఇంటర్మీడియట్ వరకు చదివి, గత కొంత కాలంగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయివేట్ ఉద్యోగం చేస్తున్నాడు. గతసంవత్సరం కాలంగా రాజశేఖర్ ఆన్లైన్లో ప్లేయింగ్ కార్డ్స్, క్రికెట్ బెట్టింగ్‌లు ఆడేవాడు. ఆన్లైన్ బెట్టింగ్స్‌కు భానిసై సంవత్సర కాలంలోనే మూడు నుంచి నాలుగు లక్షల వరకు డబ్బులు పోగొట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా తల్లి శశికళ బీరువాలో దాచిపెట్టిన బంగారంను సైతం కుదవపెట్టి ఆన్లైన్ బెట్టింగ్‌లు ఆడి ఓడిపోయాడు. ఇదిలా ఉండగా శివరాత్రి సందర్భంగా తల్లి శశికళ ఈ నెల 18వ తేదీన సాయంత్రం 4గంటలకు బీరువాను సదరుతుండగా అందులో దాచిపెట్టిన తులంనర బంగారం కనిపించలేదు. దీంతో తనభర్తతో పాటు ముగ్గురు పిల్లలను అడిగింది. అలాగే పెద్దకొడుకును కూడా నువ్వే తీశావా? అని గట్టిగా నిలదీసింది.
దీంతో తాను తీసుకోలేదని నైట్ డ్యూటికని శనివారం రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు వెళ్లాడు. తాను తప్పుచేశానని, ఆ బంగారం తానే తీసుకున్నానని, ఆన్లైన్ లో బెట్టింగ్‌లు ఆడిపోగొట్టుకున్నానని, శంషాబాద్‌లో ఓ వ్యక్తి దగ్గర 40వేలకు కుదవపెట్టానని, దానికి సంబంధించిన స్లిప్‌లు తన మొబైల్ పోచ్ వెనుక ఉన్నాయని, తాను చనిపోతునానని, ఇక తల్లిని, తండ్రిని మంచిగా చూసుకోవాలని తన సోదరుడికి ఆదివారం తెల్లవారుజామున 2.44 గంటలకు మెసేజ్ చేశాడు. తండ్రి చంద్రయ్య ఎప్పటిలాగానే ఉదయం 5గంటలకు పాలు పిదకడానికి షెడ్డు వద్దకు వెళ్లాడు. అక్కడ ఓ వేపచెట్టుకు పెద్దకుమారుడు రాజశేఖర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకొని ఉండడం కనిపించింది. తండ్రి, స్థానికుల సమాచారంతో పహాడిషరీఫ్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ కేసును పహాడిషరీఫ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.