- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒకరితో లవ్.. మరొకరితో ఎఫైర్.. సెల్ఫీ సూసైడ్ వీడియోలో సంచలనాలు బయటపెట్టిన ప్రియుడు
దిశ, భీమదేవరపల్లి : ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని ముల్కనూర్ గ్రామంలో చోటుచేసుకుంది. మృతుడు తన సెల్ ఫోన్ లో చనిపోయే ముందు సెల్ఫీ వీడియో రికార్డు చేసుకున్నాడు. వీడియోలో మృతుని వాంగ్మూలం ఆధారంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామానికి చెందిన మండ కరంచంద్ కుమారుడు మండ సాయిచంద్ (24) గ్రామంలోనే హోటల్ నడుపుకుంటారు. కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని అయితే ఆ అమ్మాయి మోసం చేసి వేరొక యువకుడితో సంబంధం పెట్టుకుందని సెల్ఫీవీడియో తీసి ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ నెల 17వ తేదీన హనుమకొండలోని జులైవాడకు చెందిన గిన్నె విష్ణువర్ధన్ అనే వ్యక్తి అమ్మాయి ఉండే జులై వాడకి నన్ను పిలిపించుకొని దారుణంగా కొట్టి, ఇబ్బందులకు గురిచేసి బెదిరించారని తెలిపారు. అనంతరం హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా విష్ణువర్ధన్ ని, ఆ అమ్మాయిని కనీసం పిలిపించి పోలీసులు ఎంక్వయిరీ కూడా చేయలేదని బాధపడ్డాడు. ఆ అమ్మాయి, విష్ణువర్ధన్ నన్ను చాలా టార్చర్ చేశారని, వారు పెళ్లి చేసుకోవడం లేదని నువ్వే చేసుకో అని నన్ను నమ్మించి లాస్ట్ కి మోసం చేశారని, నా జీవితంతో ఆడుకున్నారని వారిని విడిచిపెట్టొద్దంటూ వీడియోలో తెలిపాడు. గత 4 నెలలుగా నాతో ఆడుకొని మెంటల్ గా, డిస్టర్బ్ చేసి చాలా టార్చర్ పెట్టారని తెలుపుతూ శనివారం అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల తర్వాత అమ్మాయికి శుభాకాంక్షలు తెలిపి చనిపోతున్నట్లు పేర్కొన్నాడు.
ఆ అమ్మాయి ప్రతిసంవత్సరం చేసుకునే పుట్టినరోజున తన మరణం గుర్తుకు రావాలని, అందుకే ఇప్పటిదాకా చనిపోకుండా ఆగాను అని వీడియోలో తెలిపాడు. చాలా ఆలోచించాను ఇంతకు మించి వేరే మార్గం లేదు అంటూ అక్క, బావ, అమ్మ, నాన్న, స్నేహితులందరూ క్షమించండి. మీరు మంచిగా ఉండండి. ఈ బాధను నేను భరించలేక పోతున్నాను, అంటూ మీ ప్రేమని, మీ స్నేహాన్ని మిస్ అవుతున్న అంటూ, వారిద్దరిని విడిచిపెట్టకండి అంటూ ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నేను చనిపోయాక ఆ అమ్మాయిని తీసుకువచ్చి నా శవాన్ని చూపించండి, ఇదే నా చివరి కోరిక అంటూ వీడియోలో తెలిపాడు. మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ముల్కనూర్ ఎస్సై మహేందర్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు.