- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చికిత్స పొందుతూ వివాహిత మృతి

దిశ చేగుంట : ప్రైవేటు ఆసుపత్రిలో జ్వరంతో చేరి చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. చేగుంట ఎస్సై ప్రకాష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామానికి చెందిన రజితను(30) చేగుంట మండల పరిధిలోని ఉల్లి తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన బ్యాగరి రాజుతో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె సంతానం. ఈనెల 6న రజిత జ్వరంతో బాధపడుతోందని సూరంపల్లి లో ఉన్న మామ భిక్షపతికి అల్లుడు రాజు సమాచారం అందించాడు.
దీంతో నార్సింగి మండల కేంద్రంలో ఉన్న చారి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం అక్కడ చేర్పించారు.తరలించారు. ఆసుపత్రికి వెళ్లి చూసేసరికి మాటలు రాకుండా ఉందని సోమవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలు రజిత తండ్రి భిక్షపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై ప్రకాష్ గౌడ్ తెలిపారు.