- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉపాధ్యాయుడి నిర్వాకం.. విద్యార్థులకు బూతు సినిమాలు చూపిస్తూ ఆపై అసభ్యకరంగా
దిశ, వెబ్‌డెస్క్: ఉపాధ్యాయుడు అంటే విద్యార్థులు తప్పులు చేస్తే వాటిని సరిచేసి వారిని మంచి మార్గంలో పెట్టేవాడు. కానీ ఓ నీచపు ఉపాధ్యాయుడు మాత్రం అందుకు విరుద్ధంగా నడుచుకున్నాడు. తన వద్ద పాఠాలు చేర్చుకునే విద్యార్థినిలకు బూతు వీడియోలు చూపిస్తూ వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ దారుణ సంఘటన మహారాష్ట్రలో జరిగింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
గోండియా జిల్లాకు చెందిన 52 ఏళ్ల వ్యక్తి ఓ ప్రైమరీ స్కూల్లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే 5వ తరగతి చదువుతున్న ఎనిమిది మంది పిల్లలకు బూతు వీడియోలు చూపించాడు. అంతే కాకుండా ఆ విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి వారి ప్రైవేట్ పార్ట్స్‌పై టచ్ చేస్తూ వేధింపులకు గురిచేశాడు. దీంతో విద్యార్థినిలు వారి తల్లిదండ్రులకు చెప్పారు. కోపాద్రిక్తులైన పేరేంట్స్ ఆ నిచపు ఉపాధ్యాయుడు గురించి ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన అంతర్గత విచారణ జరిపించి ఉపాధ్యాడుది తప్పు ఉందని తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఆ కీచక ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినిల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.