- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందమైన కోడలిపై మనసుపడ్డ మామ.. కొడుకు లేని టైం చూసి అదే పనిగా..
దిశ, వెబ్‌డెస్క్: నేటి కాలంలో అక్రమ సంబంధాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. భర్తలకు తెలియకుండా భార్యలు.. భార్యలకు తెలియకుండా భర్తలు వివాహేతర సంబంధాలు పెట్టుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లో జరిగిన ఇలాంటి ఘటనే ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. సొంత కోడలిపైనే మనసు పడ్డ మామ.. కొడుకు చేతిలో అతి కిరాతంగా హత్యచేయబడ్డాడు. దీనిపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
భూత్ బంధాని గ్రామానికి చెందిన దరోగ్ సింగ్ అనే వ్యక్తి కొడుకు సంజయ్ ధుర్వేలో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే.. సంజయ్‌కు గతంలో ఓ యువతితో వివాహం జరిగింది. అప్పటి నుంచి ముగ్గురు కలిసి ఉండేవారు. కొడుకు రోజూ ఉదయం డ్యూటీకి వెళ్లి సాయంత్రానికి తిరిగి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలోనే అందంగా ఉండే కోడలిపై మామ మనసు పడ్డాడు. కొన్నాళ్లకు కోడలు సైతం మామకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక కొడుకు లేని సమయంలో తండ్రి కోడలితో ఎంజాయ్ చేసేవాడు.
కొన్నాళ్లకు తండ్రి, భార్యపై అనుమానం వచ్చిన సంజయ్.. వారిపై నిఘా పెట్టాడు. తండ్రికి భార్యతో అక్రమ సంబంధం ఉందని తెలుసుకుని కోపంతో ఊగిపోయాడు. ఇక తండ్రిని ఎలా అయినా చంపాలని ప్లాన్ చేసిన సంజయ్.. దరోగ్‌తో మాట్లాడాలని ఓ చోటుకు తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లాక అక్రమ సంబంధం విషయమై తండ్రిని ప్రశ్నించగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. క్షణికావేశంలో ఉన్న కొడుకు అతికిరాతంగా తండ్రిని హత్య చేశాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం నిందితుడు సంజయ్‌ని అరెస్ట్ చేశారు.
Read more: