నానక్ రాంగూడలో యువతిపై వీధికుక్క దాడి

by Anjali |
నానక్ రాంగూడలో యువతిపై వీధికుక్క దాడి
X

దిశ, శేరిలింగంపల్లి: నగరంలో వీధికుక్కల దాడులు సర్వ సాధారణంగా మారాయి. ఎక్కడో ఓ చోట వీధికుక్కలు చిన్నారులపై, సామాన్యులపై దాడులు చేస్తూనే ఉన్నాయి. తాజాగా మంగళవారం ఉదయం గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలోని నానక్ రాంగూడ లాంకోహిల్స్ సమీపంలో స్నేహితులతో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న యువతిపై వీధి కుక్క ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో ఆ యువతి కిందపడిపోయింది. అక్కడే ఉన్న వారు తరిమి వేయడంతో అక్కడి నుండి పారిపోయింది. అయితే గాయాలైన యువతిని స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

Advertisement

Next Story