యూపీలో ఘోరం.. ఆరేళ్ల బాలికపై లైంగికదాడి.. హత్య

by Javid Pasha |
యూపీలో ఘోరం.. ఆరేళ్ల బాలికపై లైంగికదాడి.. హత్య
X

దిశ, వెబ్ డెస్క్: యూపీలో ఘోరం జరిగింది. ఓ ఆరేళ్ల బాలికపై లైంగికదాడి అనంతరం హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సజాతి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లా సజాతి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలిక గత శనివారం అదే ఊరులో ఉంటున్న తమ బంధువుల ఇంటికి వెళ్తున్నానని తల్లిదండ్రులతో చెప్పి బయటకు వెళ్లింది. అయితే చీకటి పడ్డాక కూడా బాలిక రాకపోవడంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు సదరు బంధువుల ఇంటికి వెళ్లి వాకబు చేశారు. అయితే బాలిక తమ ఇంటికి రాలేదని వారు చెప్పడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే మంగళవారం గ్రామ శివారులోని ఓ పాడుపడ్డ పొలంలో ఓ బాలిక పాక్షిక అస్తిపంజరం లభించింది. ఆరా తీసిన పోలీసులు ఆ అస్తిపంజరం అదృశ్యమైన బాలికదిగా గుర్తించారు. బాలికపై లైంగికదాడి చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన చంద్రభాను అనే వ్యక్తితో పాటు అతడి భార్య సుధా, సోదరుడు సుల్తాన్ లను అదుపులోకి తీసుకున్నట్లు అడిషనల్ డీసీపీ అంకిత్ శర్మ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed