- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
POCSO Case: కీచక ఉపాధ్యాయుడు.. ఆరో తరగతి విద్యార్థిని పట్ల అసభ్య ప్రవర్తన
by Gantepaka Srikanth |

X
దిశ, వెబ్‌డెస్క్: సమాజంలో ఎలా నడుచుకోవాలో చెప్పి సక్రమ పద్దతిలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడే(Teacher) దారుణంగా ప్రవర్తించారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం(Vizianagaram) జిల్లా నెల్లిమర మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆరో తరగతి విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బాలికను బెదిరించాడు. భయంతో ఇంటికొచ్చిన బాలిక తల్లిదండ్రులకు ఉపాధ్యాయుడి వికృత చేష్టల గురించి వివరించింది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు ఉపాధ్యాయుడిపై పోలీసులు పోక్సో కేసు(POCSO Case) నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story