రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..

by Sumithra |   ( Updated:2023-04-22 16:34:49.0  )
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..
X

దిశ, మొయినాబాద్ : వాహనం అదుపుతప్పి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. మొయినాబాద్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ లక్ష్మీరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ గ్రామానికి చెందిన కంజర్ల జయకర్ (50) గ్లోబల్ కాలేజీలో వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నారు. రోజులాగే డ్యూటీ ముగించుకొని స్కూటీ నెంబర్ TS 07FV 8074 వాహనం పై ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యలో తహసిల్దార్ కార్యాలయం ఎదుట వాహనం అదుపుతప్పింది. దీంతో మృతుడు కింద పడిపయి తీవ్రగాయాలపాలయ్యారు. స్థానికులు గమనించి వెంటనే భాస్కర ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. ఈ మేర కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story