- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..
దిశ, ఇందల్వాయి : 44వ జాతీయ రహదారిపై గురువారం సాయత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గంగారాం తండా గ్రామ పంచాయితీకి చెందిన ఒంటెద్దు ముత్యం (55) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన సంఘటన చూపరులను కంటతడి పెట్టించింది. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇందల్వాయిలో నివాసం ఉండే ఒంటెద్దు ముత్యం రోజు మాదిరిగా కల్లు తీసుకొని రావడానికి తన ద్విచక్రవాహనంపై వెళ్లాడు. అతను తెల్లకల్లు తీసుకొని వస్తుండగా రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు.
సరిగ్గా అదే సమయానికి వెనుక నుండి వచ్చిన లారీ ఢీకొంది దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 44వ జాతీయ రహదారిపై ఎటువంటి మత్తు పదార్థాలను అమ్మకూడదని నిబంధనలు ఉన్నప్పటికి అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరించడం వల్లనే నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. పోలిసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నమని తెలిపారు.