- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rachakonda: మెయిల్స్‌తో కమ్యూనికేషన్ భద్రం.. ఫోన్ నెంబర్లు పోయినా టచ్‌లో ఉండేలా ప్లాన్
దిశ, సిటీ క్రైం: క్రిమినల్స్ రోజురోజుకూ తెలివిలో మితిమీరి పోతున్నారు. వారి నెట్ వర్క్‌ను బలోపేతం చేసుకునేందుకు కొత్త మార్గాలను వెతుకుంటున్నారు. పోలీసులకు దొరికినప్పుడు వారి సిమ్ కార్డులు సీజ్ అవుతున్నాయి. ఆ తర్వాత మూడు నెలలకు ఆ సిమ్ కార్డుకు కేటాయించిన నంబరు మరొకరికి కేటాయించడం జరుగుతుంది లేదా పనికి రాకుండా పోతుంది. దీంతో క్రిమినల్స్ కు ఆ సిమ్ లో ఉండే కాంటాక్ట్ నెంబర్స్ డిలిట్ అవుతుండడంతో వారితో కాంటాక్టులో ఉండే వారి నంబర్లను తిరిగి పొందడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
ఇలా వారి నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న వారితో సరైన సమయంలో సంప్రచదించలేక లక్కీ ఛాన్సులు మిస్సవుతున్నట్లు ఫీలవుతున్నారు. దీంతో ఇలా వారి కమ్యూనికేషన్ దెబ్బ తినకుండా సిమ్ కార్డుల్లో ఉండే వారి సమాచారాన్ని పోలీసులు గుర్తించకుండా ఇప్పుడు క్రిమినల్స్ సరికొత్తగా మెయిల్స్ ను వారి అడ్డగా చేసుకుంటున్నారు. ఈ మెయిల్స్ ద్వారా వారి నెట్ వర్క్ కమ్యూనికేషన్ ను మిస్ కాకుండా కంటిన్యూ చేస్తున్నారు.
క్రిమినల్స్ @ మెయిల్స్ డాట్ కామ్
పోలీసులకు పట్టుబడినప్పుడు, లేదా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు క్రిమినల్స్ ఎప్పటికప్పుడు వారి సిమ్ కార్డులను మారుస్తుండడంతో వారి నెట్‌వర్క్‌లో ఉండే సభ్యులతో కాంటాక్టులు మిస్సవుతున్నట్లు గ్రహించారు. దీంట్లో భాగంగా ఇప్పుడు క్రిమినల్స్ చాలా మంది సొంత మెయిల్స్ ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ మెయిల్స్ ద్వారా వారి సహచర సభ్యులను పలకరించుకుంటున్నారు. వారి నంబర్లను మెయిల్స్‌కు అనుసంధానం చేసుకుంటున్నారు.
ఇలా క్రిమినల్స్ జైలుకెళ్లాక అక్కడ పరిచయమయ్యే వారి ఫోన్ నంబర్లు, వారి నేర ప్రక్రియ ఆలోచనలతో ఉండే ఇతర క్రిమినల్స్ నంబర్లు, మెయిల్స్ లో భద్రపర్చుకుంటున్నారు. ఈ విధంగా ఫోన్ నంబర్లు మీద ఆధార పడకుండా మెయిల్స్ వారికి సురక్షితంగా మార్చుకుంటున్నారు. వాటికి వారు సొంతంగా పెట్టుకునే పాస్ వర్డ్, యూజర్ నేమ్ ఉండడంతో ఆ మెయిల్స్ ను ఎవరు తెరువలేరనే ధీమా కూడా క్రిమినల్స్ లో ఉంది.
మెయిల్స్‌లోనే సంప్రదింపులు..
జైలుకు వెళ్ళిన తర్వాత ఫోన్ నెంబరు పనిచేయకుండా పోతుండడంతో క్రిమినల్స్ వారి జైలు నుంచి బయటకు విడుదలైన తర్వాత ఆ సమాచారాన్ని మెయిల్స్ ద్వారా వారి సహచరులకు పంపించుకుంటున్నారు. మెయిల్ ద్వారానే తీసుకున్న కొత్త నెంబరును షేర్ చేసుకుంటున్నారు. ఈ విధంగా వివిధ నేరాల్లో అరెస్టై జైలుకు వెళ్ళొస్తున్న వారు ఇప్పుడు మెయిల్స్ ద్వారా పలకరించుకుంటూ వారి కమ్యూనికేషన్ ను బ్రేక్ కాకుండా చూసుకుంటున్నారని రాచకొండ పోలీసుల దర్యాప్తులో బయటపడింది. మూడు రోజుల కిందట రాచకొండ పోలీసులు ఏపీకి చెందిన సాయిరాంరెడ్డి యువకుడిని అరెస్టు చేసి అతని నుంచి 7 తుపాకులు, 11 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంలో అతన్ని విచారించినప్పుడు క్రిమినల్స్ మెయిల్స్ రహస్యాన్ని బయటపెట్టాడు. అతను కాకినాడ జైలులో 6 నెలలు, చర్లపల్లి జైల్లో 4 నెలలు ఉన్నాడు. ఈ సమయంలో అతను జైలులో పరిచయమైన వారందరీ మెయిల్స్ సేకరించుకున్నాడు. బయటికొచ్చాక మెయిల్స్ ద్వారా సంప్రదించి తాను విడుదలైనట్లు, తన కొత్త ఫోన్ నెంబరును షేర్ చేశాడని సమాచారం. అలా దొరికిన కాంటాక్టుతోనే అతను హైదరాబాద్ లో తుపాకులను విక్రయించేందుకు స్కెచ్ వేశాడని పోలీసులు దర్యాప్తులో తేలింది.