కూతురికి తండ్రి పోలికలు వచ్చాయని 3 నెలల పసికందును చంపిన తల్లి

by Hamsa |   ( Updated:2023-03-24 06:42:12.0  )
కూతురికి తండ్రి పోలికలు వచ్చాయని 3 నెలల పసికందును చంపిన తల్లి
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల చాలా మంది ఆలోచన శక్తి కోల్పోయి క్షణికావేశంలో దారుణాలకు పాల్పడుతున్నారు. అలాగే కన్న బిడ్డలను కూడా అతి కిరాతకంగా తల్లిదండ్రులే ప్రాణాలు తీస్తున్న ఘటనలు అందరి మనసును కలిచివేస్తున్నాయి. తాజాగా, మహారాష్ట్రలో కూతురికి తన పోలికలు రాలేదని తల్లి 3 నెలల శిశువు గొంతుకోసి చంపేసింది.

వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ మహిళ ఇటీవల కూతురికి జన్మనిచ్చింది. అయితే కూతురి పోలీకలు తన తండ్రిలా ఉన్నాయని అత్తమామలు, బంధువులు, చుట్టుపక్కల వారు చర్చించుకునేవారు. దీంతో అది భరించలేని మహిళ మనస్తాపానికి గురైంది. తన 3 నెలల పసికందు గొంతు కోసి చంపేసింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పాప మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించి కేసు నమోదు చేసుకున్నారు. అయితే కూతురు ఎలా మృతి చెందిందని తల్లిని విచారణ చేశారు. దీంతో ఆ మహిళ తడబడుతూ సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించగా అసలు విషయం తెలిపింది. కూతురిని తానే చంపినట్లు నేరాన్ని ఒప్పుకుంది. పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు

Advertisement

Next Story

Most Viewed