Hyderabad: వాష్‌రూంలోనూ అమ్మాయిల భద్రత కరువు.. 20 ఏళ్ల యువతిపై కామాంధుడి ఘాతుకం

by karthikeya |   ( Updated:2024-11-04 06:13:21.0  )
Hyderabad: వాష్‌రూంలోనూ అమ్మాయిల భద్రత కరువు.. 20 ఏళ్ల యువతిపై కామాంధుడి ఘాతుకం
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. స్కూళ్లలో, ఆఫీసుల్లో, కార్లలో, బస్సుల్లో.. ఇలా ఎక్కడ చూసినా అత్యాచారాలకు గురవుతూన్న మహిళలకు.. ఇప్పుడు వాష్‌రూంలో కూడా భద్రత లేకుండా పోయింది. తాజాగా హైదరాబాద్‌ (Hyderabad)లోని ఘట్‌కేసర్‌లో అలాంటి ఘటనే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మార్ట్‌లో పనిచేసే 20 ఏళ్ల యువతి వాష్‌రూం (Washroom)కు వెళ్లగా ఆమె వెనకే లోపలికి ప్రవేశించిన మార్ట్ సూపర్‌వైజర్ ఖాజాబషీర్ (35) ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని, చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె కూడా సైలెంట్‌గా ఉండిపోయింది. నెల రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా రెండు రోజుల క్రితం ఆమె కళ్లు తిరిగిపడిపోవడంతో కుటుంబ సభ్యులు డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆమె గర్భవతి అని తేల్చారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఆమెను ప్రశ్నించగా జరిగినదంతా చెప్పింది. ఇక వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బషీర్‌ను అదుపులోనికి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read More : ప్రేమోన్మాది ఘాతుకం.. డిగ్రీ విద్యార్థినిపై విచక్షణారహితంగా కత్తితో దాడి

Advertisement

Next Story

Most Viewed