- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనుమానం పెనుభూతమైంది.. ఓ యువకుడి ప్రాణం పోయింది
దిశ, వెబ్‌డెస్క్: వివాహ బంధంలో ఒకసారి అనుమానం అనే భూతం చేరితే అది ఎంతటి పరిణామాలకు దారి తీస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భార్య వేరే వాళ్లతో.. లేదా భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారనే అనుమానంతో ఎన్నో కాపురాలు కూలిపోతున్నాయి. అదే విధంగా కొంతమంది క్షణికావేశంలో హత్యలు చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. తాజాగా జరిగిన ఇలాంటి ఘటనే ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. తన భార్య ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భర్త చేసిన పనికి ఓ వ్యక్తి తన ప్రాణాలను కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నల్గొండ జిల్లాలోని తిప్పర్తి మండలం సర్వారం గ్రామానికి చెందిన పాపకంటి మసూద్ అలియాస్ మధు (35) అతని భార్యతో నివాసం ఉంటున్నాడు. అదే గ్రామానికి చెందిన శంకర్ (27) అనే యువకుడితో తన భార్య చనువుగా ఉండటాన్ని తట్టుకోలేక పోయాడు మధు. ఈ క్రమంలో తన భార్యకి ఆ యువకుడికి మధ్య అక్రమ సంబంధం ఉందని అనుమానం పెంచుకున్నాడు. అనంతరం శనివారం మధ్యహ్నాం సమయంలో శంకర్‌తో గొడవకు దిగాడు మధు. ఈ క్రమంలోనే శంకర్‌పై కత్తితో దాడి చేశాడు. అయితే చుట్టుపక్కల వాళ్లు ఆపేందుకు విచక్షణ రహితంగా దాడి చేసే సరికి అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అది గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు అతడిని వెంటనే నల్గొండ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున శంకర్ మృతి చెందాడు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.