- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాత కక్షల నేపథ్యంలో వ్యక్తి పై కత్తితో దాడి మృతి..
దిశ, టేకులపల్లి : పాత కక్షల నేపథ్యంలో వ్యక్తి పై దాడి చేసిన నిందితుడు హాస్పటల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మండలంలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. టేకులపల్లి మండలం బోర్డు ఎస్సై రంజిత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం టేకులపల్లి మండలం గంగారం గ్రామపంచాయతీ పరిధి సంపత్ నగర్ గ్రామానికి చెందిన గొల్ల జానకిరాముడు (54) అనే వ్యక్తి అదే గ్రామంలో పాయం పెద్దరామయ్య పెద్దకర్మ కార్యక్రమానికి సోమవారం మధ్యాహ్నం సమయంలో భోజనానికి వచ్చారు. అప్పటికి అదే కార్యక్రమంలో నిమ్మల గంటి వెంకన్న అనే వ్యక్తి మేకలు కోసేందుకు కత్తితో వచ్చాడు. పని పూర్తిచేసుకున్న తర్వాత మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఇద్దరూ భోజనం చేసి కలిసి బయటికి వచ్చారు.
పాయం రామయ్య ఇంటి ముందు తన దగ్గర ఉన్న కత్తితో జానకి రాముల పై దాడి చేసి గుండె పై కత్తితో పొడిచాడు. ఒక్కసారిగా రోడ్డు పై కుప్పకూలిన అతడిని స్థానికులు ఆటోలో తీసుకు వెళ్తున్న క్రమంలో ఎదురుగా 108 వాహనం వచ్చి హాస్పిటల్ కి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు భార్య ప్రమీల ఉన్నారు. సంఘటన స్థలాన్ని ఇల్లందు డీఎస్పీ రమణమూర్తి, బోడు ఎస్సై రంజిత్ కుమార్, టేకులపల్లి సీఐ ఇంద్రసేనారెడ్డితో కలిసి పరిశీలించారు. స్థానిక కుటుంబ సభ్యులు సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నిమ్మల గంటి వెంకన్న కుమారుడు నవీన్ 11 నెలల క్రితం మృతి చెందాడు. జానకి రాముల కుమారుడు వలనే ట్రాక్టర్ మీద నుంచి కింద పడి చనిపోయాడు అని తన కుమారుడి మృతికి కక్ష పెట్టుకుని హత్య చేసి ఉండవచ్చు అని ఆరోపిస్తున్నారు.