భార్య ప్రవర్తన నచ్చక భర్త ఉరి వేసుకొని ఆత్మహత్య

by Kalyani |   ( Updated:2024-10-13 15:36:01.0  )
భార్య ప్రవర్తన నచ్చక భర్త ఉరి వేసుకొని ఆత్మహత్య
X

దిశ, యాచారం : ఉరేసుకొని ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ ఐ మధు, తెలిపిన వివరాల ప్రకారం..మండల పరిధిలోని మొండి గౌరెల్లి, గ్రామానికి చెందిన గంగనమోని నగేష్, (25)కి ఇటీవల కాలంలో ఒక మహిళతో వివాహం అయ్యింది. తన భార్య మరొక వ్యక్తితో చనువుగా మాట్లాడుతోందని మనోవేదనకు గురయ్యేవాడు. దసరా పండుగ వేడుకల అనంతరం తాను ఉంటున్న గదిలో చీరతో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed