- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
శోభనం రాత్రే చుక్కలు చూపించిన భర్త.. ఆస్పత్రి పాలైన నవ వధువు

దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లింటే ఆడపిల్లల కలలే వేరు. కాబోయే భర్త రాజకుమారిడిలా ఉండాలని.. హీరోలా కటౌట్ ఉండాలని, తనను సుఖ పెట్టాలని ఆశపడుతుంటారు. అందరికీ అలాంటి వాళ్లు దొరకకపోయినా.. వచ్చిన వాడినే అలా ఊహించుకుంటూ పెళ్లిపీటలు ఎక్కుతారు. కానీ, వారి కలలను కల్లాలు చేసే భర్త వస్తే ఆశలన్నీ ఆవిరి కావల్సిందే. ఇలాంటి సంఘటనే ఓ నవ వధువు జీవితంలో జరిగింది. శోభనం రోజు రాత్రే భర్త చుక్కలు చూపించడంతో ఆస్పత్రి పాలయింది. తమిళనాడులో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
తిరువళ్లూరు జిల్లాలోని కూతనల్లూరుకు చెందిన నాగరాజ్, పరమేశ్వరి దంపతులు కూతురు నళిని (29)ని తోసుత్తూరుకు చెందిన రాజ్ కుమార్ (37)తో నెల రోజుల క్రితం ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లికి భారీగా కట్నకానుకలు సమర్పించుకున్నారు. వారం రోజుల క్రితం వరుడి ఇంట్లో శోభనం ఏర్పాటు చేశారు కుటుంబ సభ్యులు. పాలగ్లాసుతో సిగ్గు పడుతూ గదిలోకి వెళ్లిన పెళ్లి కూతురు కొద్ది సేపటికే గట్టిగా అరవడం మొదలు పెట్టింది. అయితే ఆ అరుపులు శోభనం సందర్భంగా వస్తున్నాయని.. ఇద్దరు సరసాలాడుతున్నారని కుటుంబ సభ్యులు భావించారు. అయితే గంటలు గడిచినా అలాగే నళిని అరుపులు పెడుతుండటంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది.
వెంటనే శోభనం గది దగ్గరకు వెళ్లి తలుపు తీయాలని గట్టిగా చెప్పారు. డోర్ తీసిన వరుడు రాజ్ కుమార్ అత్తమామలను నెట్టుకుని బయటకు పరుగులు తీశాడు. లోపలికి వెళ్లి చూసిన తల్లిదండ్రులు షాక్ అయ్యారు. నళిని ఒంటిపై తీవ్ర గాయాలై.. బట్టలు చిరిగి ఓ మూలకు పడిపోయి ఉంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్న చేయించారు. శనివారం కోలుకున్న ఆమె.. శోభనం రోజు జరిగిన దారుణాన్ని బయటపెట్టింది. రాజ్ కుమార్ అసలు మగవాడు కాదని.. అతనో హిజ్ర అని షాకింగ్ విషయం చెప్పింది.
అతడితో అసహజంగా సెక్స్ చేయాలని తీవ్రంగా కొట్టినట్టు తెలిపింది. చెప్పలేని విధంగా తన శరీరంతో ఆడుకున్నాడని వాపోయింది. చలించిపోయిన బంధువులు ఆస్పత్రిని నుంచి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రాజ్ కుమార్‌పై ఫిర్యాదు చేశారు. అయితే నవ వరుడు రాజ్ కుమార్ సైతం ఇదే మాదిరిగా చెప్పడం గమనార్హం. పెళ్లి కూతురు తనతో అసహజంగా సెక్స్ చేయాలని ఒత్తిడి చేసిందని చెప్పాడు. అలా చేయనందుకే తనపై కేసు పెట్టిందని ఆరోపించాడు.