- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దారుణం.. నాలుగు రోజుల పసికందును బూటు కాలుతో తొక్కి చంపిన పోలీస్?
దిశ, వెబ్‌డెస్క్: జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. నిందితుడిని పట్టుకునే క్రమంలో ఓ నాలుగు రోజుల పసికందు పోలీసుల కాళ్ల కింద పడి మరణించింది. అయితే పోలీసులు తొక్కడం వల్లే తమ బిడ్డ చనిపోయిందని బాధితులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. గిరిడీ జిల్లాలోని ఒక ప్రాంతానికి చెందిన భూషన్ పాండే అనే వ్యక్తి ఓ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అయితే అతడు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే అతడిపై నిఘా పెట్టిన పోలీసులు భూషన్ అతడి ఇంట్లో ఉన్నట్లు సమాచారం అందుకున్నారు. దీంతో అతడిని పట్టుకునేందుకు తెల్లవారుజామున 3:20 గంటల సమయంలో భూషన్ ఇంటికి వెళ్లారు.
పోలీసుల రాకను తెలుసుకున్న భూషన్.. అతడి ఫ్యామిలీతో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఇక పోలీసులకు నిందితుడు దొరక్కపోవడంతో వెళిపోయారు. పోలీసులు వెళ్లిన తర్వాత ఇంటికి వచ్చిన భూషన్ ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ 4 రోజుల పసికందు విగతజీవిగా పడి ఉంది. దీంతో పోలీసులే కావాలని తమ బిడ్డని బూటు కాలుతో తొక్కి చంపారని బాధిత ఫ్యామిలీ సోషల్ మీడిమా ద్వారా తెలిపారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా పోలీసులకు తెలిసింది. దీనిపై స్పందించిన పోలీసులు.. భూషన్ కేసు నుంచి తప్పించుకునేందుకే తమపై ఈ ఆరోపణలు చేస్తున్నాడని వెల్లడించారు. కాగా.. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని జిల్లా ఎస్పీని సీఎం హేమంత్ సోరేన్ ఆదేశించారు. పోస్టు మార్టం నివేదిక వచ్చిన తర్వాత అసలు నిజాలు తెలుస్తాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.