- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతడు అడిగాడని రెండుసార్లు సమర్పించుకుంది.. 4 గంటల తర్వాత..
దిశ, వెబ్‌డెస్క్ : నమ్మకం మాటున ఎంతటి మోసాలు జరుగుతున్నాయో నిత్యం చూస్తూనే ఉన్నాం. స్నేహితులు, బంధువు అని నమ్మితే నట్టేటముంచుతున్నారు. సైబర్ నేరాలపై పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నా.. వారి చేతుల్లో చిక్కుతున్న వారిలో చదువుకున్న వారే అధికంగా ఉంటుండం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఓ యువతి స్నేహితుడని నమ్మి మోసపోయింది. సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ యువతిపై సైబర్ నేరగాడు అధిక డబ్బులు ఆశ చూపి అందినకాడికి దోచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కొండపాక మండలం మెదీన్‌పూర్ గ్రామానికి చెందిన యువతికి ఇన్‌స్టాగ్రామ్ ఉంది. ఆమె ఫ్రెండ్‌గా ఉన్న యువకుడి ఇన్‌స్టా అకౌంట్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాడు.. ఆ యువతితో మాటలు కలిపాడు. తెలిసిన వ్యక్తే కావడంతో ఆమె అతడితో చాటింగ్ చేసింది. అయితే బిట్ కాయిన్స్‌లో పెట్టుబడి పెడితే ఒకటికి నాలుగింతలు వస్తాయని నమ్మించాడు. తెలిసిన యువకుడే కావడంతో ఆమె అతడిని నమ్మి రూ.50 వేలు ట్రాన్స్‌ఫర్ చేసింది. 4 గంటల్లో రూ.4 లక్షలు వస్తాయని చెప్పిన సైబర్ నేరగాడు.. డబ్బులు నీ అకౌంట్‌లో పడాలంటే మరో రూ.30 వేలు పంపాలని కోరాడు. అయినా అనుమానం రాని యువతి అతడు చెప్పిన ఐడీకి మరోసారి డబ్బులు పంపింది.
4 గంటల సమయం దాటినా రూ.4 లక్షలు ఆమె అకౌంట్లో పడకపోవడంతో ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూసింది. అప్పటి వరకు తాను చాటింగ్ చేసిన అకౌంట్ బ్లాక్ అయ్యి ఉండటంతో సదరు యువకుడికి ఫోన్ చేసి డబ్బుల గురించి వాకాబు చేసింది. అయితే తన అకౌంట్ హ్యాక్ అయిందని.. తాను దానిని వాటడం లేదని అతడి నుంచి సమాధానం రావడంతో షాక్ తిన్న యువతి నేషనల్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేసింది. ఆమె అందించిన ఐడీ వివరాల ఆధారంగా సైబర్ నేరగాడి అకౌంట్ ఫ్రిజ్ చేసిన పోలీసులు ఆమె డబ్బులు రికవరీ చేసే పని పడ్డారు.