- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గొర్రెల మందపై చిరుత దాడి.. నాలుగు గొర్రెలు మృతి
by Javid Pasha |

X
దిశ, డైనమిక్ బ్యూరో : ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గంలో చిరుత పులి సంచారం భయాందోళన కలిగించింది. గొర్రెల మందపై చిరుతపులి దాడి చేసి నాలుగు గొర్రెలను చంపేసింది. వివరాల్లోకి వెళ్తే రాయదుర్గం మండలంలోని 74 ఉడేగోళం గ్రామంలో రైతు పాపన్న కు చెందిన గొర్రెల మందపై చిరుత పులి దాడి చేసింది. ఈ దాడిలో నాలుగు గొర్రెలు మృతి చెందాయి.
ప్రభుత్వ అధికారులు తనను ఆదుకోవాల్సిందిగా రైతు పాపన్న కోరుతున్నాడు. మరోవైపు చిరుత పులి సంచారంతో రాయదుర్గం మండలంలోని పలు ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అటవీశాఖ అధికారులు పులిని బంధించి తమను కాపాడాలని కోరుకుంటున్నారు.
Next Story