చెట్టును ఢీకొని లోయలో పడ్డ కారు.. ఉపాధ్యాయులకు గాయాలు

by Javid Pasha |
చెట్టును ఢీకొని లోయలో పడ్డ కారు.. ఉపాధ్యాయులకు గాయాలు
X

దిశ, గొలుగొండ: కారు తాటి చెట్టును ఢీ కొట్టి లోయలో పడిపోయిన సంఘటనలో ఐదుగురు ఉ పాధ్యాయులకు గాయాలయ్యాయి. కొయ్యూరు మండలం రావణాపల్లిలో పనిచేస్తున్న ఐదుగురు ఉపాధ్యాయులు వెళుతున్న కారు మంగళవారం గొలుగొండ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ దగ్గర తాడిచెట్టును ఢీకొనడంతో కారు లోయలోకి దూసుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఉపాధ్యాయులకు గాయాలయ్యాయి. దీంతో వారిని నర్సీపట్నంలోని వివిధ ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం హుటాహుటిన తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలిసింది.

Advertisement

Next Story