యువకుడి దారుణ హత్య

by Mahesh |
యువకుడి దారుణ హత్య
X

దిశ, మహబూబాబాద్ ప్రతినిధి: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదుల పూస పల్లి గ్రామంలో ఆదివారం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఉమర్(20) అనే యువకుడు మామిడి పచ్చడి కోసం కాయలు ముక్కలను చేయించడానికి పక్కనే ఉన్న గ్రామానికి వెళ్ళాడు. రాత్రి అయిన ఇంటికి రాకపోవడంతో మృతుని తల్లి ఆశ పలుమార్లు కుమారుడికి ఫోన్ చేయగా ఇంటికి వచ్చినట్లు తెలిపారు. అర్ధ రాత్రి ఆరు బయట కూర్చుని ఉండగా, కొద్దీ సేపటి తరువాత రక్తపు మడుగులో పడి ఉన్నట్లు తెలిపారు. ఎవరు హత్య చేశారు.. ఎందుకు చేశారనేది పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా కుటుంబ సభ్యుల పై గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story