- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తల్లిదండ్రులు మందలించారని పదేళ్ల బాలిక ఆత్మహత్య
దిశ, వెబ్ డెస్క్: తల్లిదండ్రులు మందలించారని మనస్థాపం చెందిన ఓ పదేళ్ల బాలిక ప్రాణం తీసుకుంది. హృదయవిదారకమైన ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. తండ్రి మద్యానికి బానిసయ్యాడని, తల్లి రోజూ కొడుతుందనే కారణంతో సవిత అనే పదేళ్ల బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబడి గ్రామనికి చెందిన సవిత ఆరో తరగతి చదువుతోంది. ఇంట్లో రోజూ మందలిస్తున్నారని.. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఇంట్లో ఎవరూ లేని టైం చూసి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పని ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు.. పై కప్పుకు వేలాడుతున్న చిన్నారిని చూసి కన్నీరుమున్నీరయ్యారు.
తల్లి తరచూ కొట్టడం, తండ్రి తాగొచ్చి గొడవ చేయడంతోనే ఆ బాలిక ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదైమైనా 10 ఏళ్ల వయసులోనే ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుందంటే.. ఆ చిన్నారి ఎంతటి మానసిక క్షోభ అనుభవించి ఉండాలి. బాలిక మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.