వాళ్లిద్దరూ గవర్నమెంట్ టీచర్సే.. కానీ, భార్యను భర్త చంపేశాడు

by Anukaran |
వాళ్లిద్దరూ గవర్నమెంట్ టీచర్సే.. కానీ, భార్యను భర్త చంపేశాడు
X

దిశ, ఆర్మూర్: అనుమానం పెనుభూతమై భార్యను భర్త హత్య చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇద్ధరు ప్రభుత్వ ఉపాధ్యాయులు కాగా ఇద్దరు పిల్లలతో సంసారం సాగిపోతున్న ఆ కుటుంబంలో అనుమానంతొ భార్యను సోమవారం రాత్రి దారుణంగా కొట్టి హత్య చేశాడు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని తిరుమల కాలనిలో నివాసముండే కోట నాగమణి(38), కోట ముత్తేన్న భార్యాభర్తలు. వీరద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. సోమవారం రాత్రి ఇరువురూ గొడవపడ్డారు. ఈ క్రమంలో రాత్రి సమయంలో నాగమణిని భర్తనే తీవ్రంగా కొట్టి, గొంతుకు చీరతో ఉరి వేసి హత్య చేశాడు. ఉదయం తన భార్య ఆనారోగ్యంతో చనిపోయిందని నమ్మబలికాడు. కానీ, నాగామణి ఒంటిపైన గాయాలు ఉండటంతో స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. రంగప్రవేశం చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో విషయం చెప్పాడు. మృతురాలు ప్రస్తుతం డిచ్ పల్లి మండలం మెంట్రాజ్ పల్లి ప్రభుత్వ ఫాఠశాలలో స్కూల్ ఆసిస్టెంట్ గా పనిచేస్తున్నది. ఆమె భర్త ముత్తెన్న బాల్కొండ ప్రాంతంలో పనిచేస్తున్నట్లు సమాచారం. వీరికి ఒక కోడుకు, కూతురు ఉన్నారు.

Advertisement

Next Story