- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డీఎస్పీ సహా 8 మంది పోలీసులు మృతి
దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రౌడీషీటర్లు రెచ్చిపోయారు. కాన్పూర్ లో పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో ఓ డీఎస్పీ సహా 8 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. నేరస్థుడైన వికాస్ దూబే గ్యాంగ్ ను పట్టుకునేందుకు వారు ఉన్న చోటకు పోలీసుల బృందం వెళ్లింది. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న రౌడీ మూకలు భవనంపై నుంచి పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో ఒక డీఎస్పీ దేవేంద్ర మిశ్రా, ముగ్గురు సబ్ ఇన్ స్పెక్టర్లు, నలుగురు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఐజీ, ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని రౌడీ మూకలను పట్టుకునేందుకు ప్రత్యేక టీంలను రంగంలోకి దించారు.
ఈ ఘటనపై సీరియస్ అయిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. కాల్పులు జరిపిన రౌడీ మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మృతిచెందిన పోలీసుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.