- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రికెట్ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ వాయిదా
దిశ, స్పోర్ట్స్: జింబాబ్వేలోని హరారే వేదికగా జరగాల్సిన మహిళల వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లను రద్దు చేసినట్లు ఐసీసీ శనివారం ప్రకటించింది. కరోనా కొత్త వేరియంట్ విస్తృతంగా వ్యాపిస్తుండటంతో ఆఫ్రికా దేశాల ప్రయాణాలపై ఆంక్షలు విధించారు. దీంతో ఈ మ్యాచ్‌లు రద్దు చేస్తున్నట్లు ఐసీసీ పేర్కొన్నది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ కోసం చివరి మూడు జట్లను ఎంపిక చేయాల్సి ఉన్నది. అంతే కాకుండా న్యూజీలాండ్‌లో జరిగే వరల్డ్ కప్ తర్వాత చాంపియన్స్ ట్రోఫీకి కూడా ఇదే క్వాలిఫయర్స్ నుంచి రెండు జట్లను ఎంపిక చేయాల్సి ఉన్నది. ఇప్పుడు క్వాలిఫయర్స్ రద్దుకావడంతో ర్యాంకింగ్స్ ఆధారంగా జట్లను ఎంపిక చేస్తున్నట్లు ఐసీసీ తెలిపింది.
చివరి మూడు స్పాట్లను ర్యాంకింగ్స్ ఆధారంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్, వెస్టిండీస్ జట్లకు దక్కాయి. క్వాలిఫయర్స్‌లో ఇప్పటికే ప్రారంభమై రెండు మ్యాచ్‌లు కూడా జరిగాయి. అయితే శనివారం శ్రీలంక – వెస్టిండీస్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉండగా.. శ్రీలంక సపోర్ట్ స్టాఫ్‌లో ఒకరు కరోనా పాజిటివ్‌గా తేలడంతో మ్యాచ్ రద్దు చేశారు. ‘క్వాలిఫయర్ మ్యాచ్‌లు రద్దు చేస్తున్నందుకు చాలా బాధగా ఉన్నది. కానీ ఆఫ్రికా దేశాల్లో ప్రస్తుతం కొత్త వేరియంట్ వ్యాపిస్తున్నందున.. ఆటగాళ్ల ఆరోగ్యాలతో చెలగాటం ఆడాలని అనుకోవడం లేదు’ అని ఐసీసీ ఈవెంట్స్ హెడ్ క్రిస్ టెట్లీ అన్నారు. సాధ్యమైనంత త్వరలో జింబాబ్వేలో ఉన్న జట్లను వారి దేశాలకు తరలిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.