IOC కీలక నిర్ణయం.. క్రికెట్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్

by Anukaran |
IOC కీలక నిర్ణయం.. క్రికెట్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్
X

దిశ, వెబ్‌డెస్క్ : క్రికెట్ ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చూద్దామని ఆశించిన క్రికెట్ ఫ్యాన్స్‌కు మళ్లీ చేదు వార్తే వినిపించింది. వివరాల ప్రకారం.. 2028 లాస్‌ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చే దిశగా ఐసీసీ ఈ ఆగస్టు నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే క్రికెట్ మ్యాచ్‌లపై యూత్ క్రేజ్‌ను చూసి వచ్చే ఒలంపిక్స్‌లో కచ్చితంగా క్రికెట్‌కు ప్లేస్ ఉంటుందని అంతా భావించారు.

కానీ, అందరి ఊహాగానాలకు చెక్ పెడుతూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) షాకింగ్ నిర్ణయం తీసుకుంది. క్రికెట్‌తో పాటు వెయిట్‌లిఫ్టింగ్‌, బాక్సింగ్‌, ఆధునిక పెంటాథ్లాన్‌లకు చోటు కల్పించలేదు. ఇక జాబితాలో ఉన్న 28 క్రీడలను వచ్చే ఫిబ్రవరిలో జరిగే ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సమావేశంలో ఆమోదిస్తారు. వెయిల్‌లిఫ్టింగ్‌, బాక్సింగ్‌ సమాఖ్యల్లో నెలకొన్న అవినీతి, డోపింగ్‌ పరిస్థితులపై ఐఓసీ ఇదివరకే హెచ్చరించింది. దీంతో ఆ క్రీడలను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే 1900 పారిస్‌ క్రీడల్లో మాత్రమే క్రికెట్‌‌కు అవకాశం కల్పించారు.

Advertisement

Next Story

Most Viewed