SPB మృతికి క్రీడాలోకం సంతాపం..

by Shyam |
SPB మృతికి క్రీడాలోకం సంతాపం..
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలు మృతి పట్ల క్రీడాలోకం సంతాపం ప్రకటించింది. ‘బాల సుబ్రహ్మణ్యం మృతి బాధాకారం’ అని ప్రముఖ చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ పేర్కొన్నారు. అలాగే, ‘బాలు స్వరాలు మన మదిలో ఎప్పటికీ పదిలంగా ఉంటాయి’ అని మాజీ క్రికెటర్, ప్రస్తుత ఎంపీ గౌతమ్ గంభీర్ ట్వీట్ చేశారు.

బాలు మృతిపై మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ స్పందిస్తూ.. ‘బాలు మరణవార్త తీవ్రమైన వేదన కలిగించిందన్నారు’. అదేవిధంగా క్రికెటర్ శిఖర్ ధావన్ స్పందిస్తూ.. ‘పాటల రూపంలో మీ స్వరం ఎప్పటికీ మాతో ఉంటుందని’ వివరించారు. చివరగా బాలు మృతిపై సురేష్ రైనా మాట్లాడుతూ.. ‘అనేక తరాలకు బాలు స్వరం గొప్పప్రేరణ కలిగిస్తుందని’ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story