- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బెస్ట్ కెప్టెన్లుగా.. ధోనీ, రోహిత్ శర్మ !
బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే క్రికెట్ లీగ్ ఐపీఎల్.. కరోనా వైరస్ కారణంగా నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయినా ఐపీఎల్ గురించి మీడియాలో చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగా స్టార్ స్పోర్ట్స్ 20 మంది మాజీ క్రికెటర్లు, స్పోర్ట్స్ జర్నలిస్టులు, క్రికెట్ నిపుణులతో ఒక జ్యూరీని ఏర్పాటు చేసింది. వీరితో ఐపీఎల్‌లో అనేక విభాగాల్లో అత్యుత్తమ క్రికెటర్లను ఎంపిక చేయించింది. అంతేకాకుండా ఆ ఎంపికకు గల కారణాలను సైతం ఆ సభ్యులు విశ్లేషించారు. కాగా, జ్యూరీ సభ్యులు.. ఐపీఎల్ అత్యుత్తమ కెప్టెన్లుగా ధోనీ, రోహిత్ శర్మలకే ఓటేశారు. ధోనీ మూడు సార్లు చెన్నై సూపర్ కింగ్స్‌కి, రోహిత్ శర్మ నాలుగు సార్లు ముంబై ఇండియన్స్‌కు ఐపీఎల్ ట్రోఫీని అందించారు. ఈ అంశాలనే పరిగణలోకి తీసుకొని అన్ని సీజన్లకు కలిపి వీరిద్దరినే అత్యుత్తమ కెప్టెన్లుగా తేల్చేశారు.
కోహ్లీ ఖాతాలో ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ కప్ కూడా లేకపోవడం వల్ల అతడిని ఈ విభాగంలో జ్యూరీ సభ్యులు పట్టించుకోలేదు. కానీ ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా కోహ్లీని ఎంపిక చేశారు. ఇదే విభాగంలో విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్‌కు కూడా చోటు కల్పించారు. బౌలింగ్ విభాగంలో లసిత్ మలింగ, ఆల్ రౌండర్‌గా షేన్ వాట్సన్, ఉత్తమ కోచ్‌గా చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ను ఎంపిక చేశారు.
Tags :IPL, Dhoni, Rohit sharma, Kohli, best captain, cricket analysts