స్టేషన్లలో థర్మల్ స్ర్కీనింగ్ తప్పనిసరి: సీపీ

by Shyam |
స్టేషన్లలో థర్మల్ స్ర్కీనింగ్ తప్పనిసరి: సీపీ
X

దిశ, క్రైమ్‌బ్యూరో: రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీస్‌స్టేషన్లకు వచ్చే వారికి తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలని సీపీ మహేష్ భగవత్ సూచించారు. కమిషనరేట్ పరిధిలోని 44 పోలీస్ స్టేషన్లలో రిసెప్షెన్ ఇంచార్జ్‌లకు నేరేడ్‌మెట్‌లోని కార్యాలయంలో బుధవారం శిక్షణ జరిగింది. సీపీ మహేష్ భగవత్, అడిషనల్ డీసీపీ శిల్పవల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రిసెప్షెన్‌ల పాత్ర, ప్రాధాన్యత, లక్షణాలు, సామర్థ్యాలు, విధులు, బాధ్యతలు, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవడంపై అవగాహన కల్పించారు. ప్రస్తుతం కొవిడ్ -19 నివారణ చర్యలు, థర్మల్ పల్స్ ఆక్సిమీటర్ వాడకం, వ్యక్తుల ఆరోగ్యం తదితర అంశాలతో పాటు డీఎస్సార్ రిపోర్ట్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేసే విధానంపై శిక్షణ ఇచ్చారు.

Advertisement

Next Story