- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మధ్య తరగతి ప్రజలకు.. మెరుగైన వైద్యం అందించాలి
దిశ, సూర్యాపేట: కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట నల్లజెండాలతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ను ఆరోగ్య శ్రీలో చేర్చడం మూలంగా పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలందరికీ విస్తృతంగా కరోనా టెస్టులు చేయాలని డిమాండ్ చేశారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తిచెంది ప్రజలు అంటువ్యాధులు, విషజ్వరాలు బారిన పడే ప్రమాదం ఉందని ప్రభుత్వం వెంటనే పారిశుధ్య చర్యలు చేపట్టాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా వైద్యాధికారి రోజూ హెల్త్ బులిటెన్ విడుదల చేయడం లేదని ఆరోపించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టరేట్ ఏవో కార్తీక్‌కు సమర్పించారు.