కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించిన సీపీఎం నేత

by Shyam |
CPM leader Venkatarajam
X

దిశ, స్టేషన్ ఘన్‌పూర్: వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకట రాజం తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా రైతులు చేసిన సుదీర్ఘ పోరాటం, ముఖ్యంగా ఢిల్లీలో చేసిన రైతుల పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. కేంద్రం తలవంచేలా రైతులు పోరాటం చేసి, విజయం సాధించారని తెలిపారు. 700 మంది ఆత్మబలిదానంతో చరిత్ర లిఖించబడిన ఈ పోరాటం, వృథా కాలేదని, ప్రాణా త్యాగంతో సాధించారని కొనియాడారు. పాలకవర్గ విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్ పోరాటాలకు ఈ విజయం మార్గదర్శకం అవుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు కుమార్, రమేష్ పాల్గొన్నారు.

Advertisement

Next Story