- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాను ధైర్యంగా ఎదుర్కొన్నవి కమ్యూనిస్టు రాజ్యాలే : పోతినేని
దిశ, ఖమ్మం రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాటల గారడీతో ప్రజలను నట్టేట ముంచుతున్నాయని సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని ఏదులాపురం గ్రామంలో ఆదివారం గ్రామశాఖ సమావేశం నిర్వహించారు. సీపీఐ నుంచి సీపీఎంలోకి పొన్నెకంటి చక్రవర్తి, పొన్నెకంటి మురళి, పొన్నెకంటి వంశీ, చినుముల నవీన్, గుండేటి ఆనందరావు, మురళిలను పార్టీ కండువాలు కప్పి సీపీఎం నాయకుడు పొతినేని సుదర్శన్‌రావు ఆహ్వానించారు. పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ బడిపెట్టుబడి దారులకు, పారిశ్రామికవేత్తలకు తొత్తుగా ఉంటూ పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు.
రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో తొమ్మిది నెలలుగా దీక్ష చేస్తున్న రైతులపై కనికరం లేకుండా రాజద్రోహం కేసులు నమోదు చేయడం సిగ్గుచేటు అన్నారు. ప్రతిపక్ష, ప్రముఖ జర్నలిస్టుల ఫోన్‌లను పెగాసెస్ పేరుతో ఫోన్లలో స్ప్రెవే ఏర్పాటు చేయడం హేయమైన చర్య అన్నారు. కేసీఆర్ దళిత బంధుపై నిర్దిష్ట కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పోడు భూములకు అటవీ చట్టం ప్రకారం హక్కులు కల్పించడం లేదన్నారు. ఎల్లన్నగూడెంలో పోడు సాగు చేస్తున్నారని 20 మంది చంటి పిల్లలు ఉన్న మహిళపై కేసులు పెట్టి జైలుకు పంపడం దుర్మార్గమన్నారు. కోవిడ్‌ను నివారించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం చెందాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ను ధైర్యంగా ఎదుర్కొన్నవి కమ్యూనిస్టు రాజ్యలే అని తెలిపారు.
రాబోయే రోజుల్లో గ్రామాలే ప్రజా ఉద్యమ కేంద్రాలుగా ఉంటాయని తెలిపారు. అనంతరం నూతన శాఖ కార్యదర్శిగా రెండోసారి దుండిగల నాగయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, నాయకులు మామిండ్ల సంజీవరెడ్డి, కార్పొరేషన్ మండల కార్యదర్శి ఉరడీ సుదర్శన్ రెడ్డి, మండల నాయకులు పొన్నెకంటి సంగయ్య, ఏదులాపురం సొసైటీ చైర్మన్ ఉరడీ హైమావతి, డీవైఎఫ్ఐ నాయకులు గడ్డం సిద్దూ, పొన్నెకంటి అనీష్, ఉరడీ చంటి, వల్లెపు సోమరాజు, అరేంపుల నరేష్, లక్ష్మణ్, ప్రతాప్, డి.వెంకటేశ్వర్లు, కొండ రవి, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.