బీజేపీ ప్రమాదకర పార్టీ.. చరిత్రను వక్రీకరిస్తోంది : సీపీఎం

by Shyam |   ( Updated:2021-09-11 10:41:11.0  )
CPM leader Jahangir
X

దిశ, మోత్కూరు: భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం అలుపెరగని పోరాటం చేసిన ఘతన వామపక్షాలదే అని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ అన్నారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో సీపీఎం ప్రథమ మహాసభ నిర్వహించారు. ఈ సమావేశంలో జహంగీర్ పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో వీరోచిత పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయి మరీ పేదలకు నాలుగు లక్షల ఎకరాల భూమిని పంచిన ఘనత కమ్యూనిస్టులదే అని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ పోరాడిందని కేంద్రం చరిత్రను వక్రీకరిస్తోందని, అలాంటి రాజకీయ పార్టీలతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పేదలకు సమస్య వస్తే ఏ పరిస్థితుల్లోనైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఒక్క కమ్యూనిస్టు పార్టీ నేతలే ఉంటారని అని స్పష్టం చేశారు.

జిల్లా వ్యాప్తంగా పార్టీ సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి, నాటి చరిత్రను ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ మతసామరస్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని ఘాటుగా విమర్శించారు. పోరాటంతోనే సమస్యలు పరిష్కరించగలుగుతామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మాటూరి బాలరాజు, మండల కార్యదర్శి దండి వెంకట్ నర్సు, జిల్లా కమిటీ సభ్యులు యాదగిరి, అడ్డగూడూర్ మండల కార్యదర్శి అనిల్ కుమార్, పెద్దాపురం రాజు, గొర్రెల రాములు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed