- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేసీఆర్ వైఖరి సరైంది కాదు.. సీపీఎం నేత జహంగీర్ ఆగ్రహం
దిశ, చౌటుప్పల్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని సీపీఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ డిమాండ్ చేశారు. శనివారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని కందాల రంగారెడ్డి భవన్‌లో సీపీఎం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జహంగీర్ పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్రంలో వరిపంట వేస్తే.. ఉరి వేస్తా అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. యాసంగిలో వరిపంట వేస్తే కొనుగోలు చేయబోమని ముఖ్యమంత్రి చెప్పడం రైతులను భయబ్రాంతులకు గురిచేస్తోందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సీపీఎం ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలు నిర్వహించాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారు. ఈ సమావేశంలో సీపీఎం మున్సిపల్ కార్యదర్శి బండారు నరసింహ, ఎండి పాషా, గోశిక కర్ణాకర్, దండ అరుణ్ కుమార్, ఎండి ఖయ్యుం, బుర్రి గోపాల్ రెడ్డి, పర్నె ధర్మారెడ్డి, బొడ్డు అంజిరెడ్డి, ఎర్ర భూషయ్యలు పాల్గొన్నారు.