హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా

by Shyam |
హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా
X

దిశ, హైదరాబాద్‌: మహిళలకు పురుషులతో పాటు సమాన హక్కుల కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హింసను అరికట్టాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించారు. శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎస్వీ రమ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి దేశ వ్యాప్తంగా మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హింస పెరిగాయని అన్నారు. పని ప్రదేశాలలో శ్రామిక మహిళలు వేధింపులకు, వివక్షతకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలలో పనిచేసే మహిళా వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. చట్ట సభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. అనంతరం ధర్నా చేపడుతున్న సీఐటీయూ, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు, గ్రేటర్ నాయకులు ఈశ్వర్ రావు, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ నాయకురాలు జయ తదితరులు పాల్గొన్నారు.

tag: CPM, CITU, Dharna, working women

Advertisement

Next Story

Most Viewed