80 కుటుంబాల‌కు సీపీఐ(ఎం) భరోసా.

by Shyam |
80 కుటుంబాల‌కు సీపీఐ(ఎం) భరోసా.
X

దిశ, న‌ల్ల‌గొండ‌:
కరోనా నేపథ్యంలో గిరిజ‌న తెగ‌కు చెందిన 80 కుటుంబాల‌కు సీపీఐ(ఎం) పార్టీ భరోసా కల్పించింది. మోట‌కొండూర్ మండ‌ల ప‌రిధిలోని పిట్ట‌ల‌గూడెం గ్రామానికి చెందిన ఓ గిరిజన తెగకు చెందిన ఈ కుటుంబాలు అడ‌విలో జంతువుల‌ను, ప‌క్షుల‌ను వేటాడి వాటిని అమ్ముకుని జీవనం సాగిస్తారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో వారంతా 10రోజులుగా ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. దీంతో ప‌స్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వారి దీన స్థితిని చూసిన సీపీఐ(ఎం)నాయకులు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. 80 కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏసీపీ కె.నరసింహారెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, తహసీల్దార్ జ్యోతి, ఎంపీపీ పైల్లా ఇందిరా, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బోలగని జయరాములు, సర్పంచ్ మల్గా ఎట్టమ్మా, ఎంపీటీసీ చాడ ప్రతిభ పాల్గొన్నారు.

Tags: cpim, helping tribals, carona, lockdown

Advertisement

Next Story