అండర్‌గ్రౌండ్ మైన్స్ మూసేయాలి : చాడ వెంకటరెడ్డి

by Shyam |   ( Updated:2020-04-01 07:01:37.0  )
అండర్‌గ్రౌండ్ మైన్స్ మూసేయాలి : చాడ వెంకటరెడ్డి
X

దిశ, న్యూస్‌బ్యూరో :
సింగరేణి కాలరీస్ అండర్‌గ్రౌండ్ మైన్స్‌ను తక్షణమే మూసేసి, కార్మికులు పని చేస్తున్న మిగిలిన సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల ప్రాంతాల్లో కరోనా వైరస్ అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ విషయంలో గనుల యజమానులకు, ఏజెంట్లకు, మేనేజర్లకు స్పష్టమైన మార్గదర్శకాలను, ఆదేశాలను జారీచేసిందని తెలిపారు. కానీ సింగరేణి యాజమాన్యం ఇప్పటి వరకు దానిని అమలుపరచలేదని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా జోక్యం చేసుకొని సింగరేణి అండర్‌గ్రౌండ్ మైన్స్‌ను తక్షణమే మూసివేయడానికి సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించాలని లేఖ ద్వారా తెలియజేశారు.

Tags: Underground mines, Chada Venkat Reddy, CPI, Singareni colleries, Corona

Advertisement

Next Story

Most Viewed